ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని 79 మండలాలకు 47 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ప్రభుత్వం 42 మండలాల్లో కరవు ఉన్నట్లు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. డోర్నకల్, తొర్రూరు, న్యూస్టుడే: ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని 79 మండలాలకు 47 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. బోర్లు, బావులు, చెరువులు, జలాశయాల్లో నీటి మట్టం తగ్గింది. గతేడాదితో పోల్చితే జలం 3-4 మీటర్ల లోతుకి పోయింది. సమీప భవిష్యత్తులో ఇంతటి ముప్పు రాకుండా చూడటానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ‘జలసిరి’ మొదలు పెట్టాయి.వీబీ జీరాంజీ అమల్లో ప్రస్తుత ప్రతికూల వాతావరణం దృష్ట్యా జల సంరక్షణకు ప్రాధాన్యమిస్తుంది.