రామప్ప ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం కోసం కొనసాగుతున్న వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ శిక్షణ శిబిరంలో భాగంగా ఏర్పాటు చేసిన పేరిణి నృత్యం అలరించింది. వెంకటాపూర్, న్యూస్టుడే: రామప్ప ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం కోసం కొనసాగుతున్న వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ శిక్షణ శిబిరంలో భాగంగా ఏర్పాటు చేసిన పేరిణి నృత్యం అలరించింది. యునెస్కో, పురావస్తు, పర్యాటకశాఖ భాగస్వామ్యంతో ఇంటాక్ ఆధ్వర్యంలో చేపట్టిన శిబిరం ఏడోరోజుకు చేరింది. గురువారం ఉదయం వాలంటీర్లకు యోగాసనాలు, మధ్యాహ్నం శిక్షణ తరగతులు జరిగాయి.