తిరుపతి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 5వ డివిజన్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తుడా ఛైర్మన్,... డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా 5వ డివిజన్ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి టి. స్వప్న ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ లకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, నగర సమగ్ర అభివృద్ధికి ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు ఎంతో అవసరమని డా. డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.