దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగొచ్చిన భువనేశ్వర్ కుమార్కు పునరాగమనం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. న్యూజిలాండ్తో తొలి మూడు టీ20ల్లో ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్న భువీపై ఇప్పుడు తుది జట్టులో చోటుపై ప్రశ్నలు మొదలయ్యాయి. సిరీస్ ఇప్పటికే భారత్ చేతిలో ఉండటంతో చివరి రెండు మ్యాచ్ల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా ఇప్పటికే 3-0తో ఆధిక్యంలో ఉంది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో చివరి రెండు మ్యాచ్ల్లో ప్రయోగాలకు అవకాశం ఏర్పడింది.