క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్సకు అంత మెరుగైన అవకాశాలు లభించవచ్చు. అయితే పాంక్రియాటిక్ క్యాన్సర్ విషయంలో ప్రారంభ దశలోనే గుర్తించడం వైద్యులకు పెద్ద సవాలుగా మారుతోంది. లక్షణాలు స్పష్టంగా కనిపించే సమయానికి వ్యాధి ముదిరిపోయే అవకాశం ఉండటంతో, ముందుగానే ప్రమాదాన్ని అంచనా వేయగల సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని మాయో క్లినిక్ పరిశోధకులు కృత్రిమ మేధ (AI) ఆధారంగా ఒక మోడల్‌ను అభివృద్ధి చేశారు. సాధారణ వైద్య రికార్డులు, రక్త పరీక్షల వివరాలను విశ్లేషించి పాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నవారిని ముందుగానే గుర్తించడం దీని లక్ష్యం.