Cyber Frauds: డిజిటల్ అరెస్ట్ కేసుల నియంత్రణకు గాను మార్గదర్శకాలు వర్తించే బ్యాంకులు, ఆర్థిక సంస్థల జాబితాను సమర్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 31 నాటికి అమలులోకి రానున్న ఆర్బీఐ సవరించిన నూతన కేవైసీ (KYC) మార్గదర్శకాలను సుప్రీంకోర్టు స్వయంగా పరిశీలించనుంది.. Cyber Frauds: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ నేరాల బాధితులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. డిజిటల్, సైబర్ మోసాల్లో నష్టపోయిన బాధితులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.