రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మక నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో వేళ్లూనుకున్న అవినీతిపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలకు చెందిన అధికారులు గురువారం ఏకకాలంలో ఆసుపత్రి ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఒకేసారి మూడు కీలక శాఖల అధికారులు రంగంలోకి దిగడంతో నిమ్స్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. లక్ష్మీభాస్కర్ కేసుతో బట్టబయలైన లీలలు నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ అవినీతి కేసు.