UP News: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి వరండాలో భూమిని తవ్వగా, నేల కింద ఉన్న మూడు నీలి రంగు డ్రమ్ముల్లో కోట్ల రూపాయలు బయటపడ్డాయి. నగదు కట్టలు కట్టలుగా కనిపించడంతో దీనిని చూసిన అధికారులు షాక్కు గురయ్యారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ నగదు కోట్లలో ఉండొచ్చని తెలుస్తోంది. ప్రయాగ్రాజ్లోని గంగానగర్ జోన్ పరిధిలో ఉన్న నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరాయిపూర్ రామ్నగర్ గ్రామంలో ఈ ఘటన.