ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిత్యం వేలాది మంది ఉద్యోగులు, వాహనదారులను చుట్టుముట్టే ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ పరిసరాల్లో పీక్ అవర్స్‌లో గంటల తరబడి వాహనాలు స్తంభించిపోతుండటంతో ఆ నాలుగు ప్రధాన బాటిల్‌నెక్ పాయింట్లను శాశ్వతంగా ఎత్తివేసేందుకు కసరత్తు వేగవంతం చేశారు.