బాలీవుడ్ నటి వాణి కపూర్ ఓటీటీ అరంగేట్రం చేసిన డార్క్ మైథలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ ‘మండల మర్డర్స్’. చేతబడులు, తంత్ర-మంత్రాలు , విచిత్రమైన హత్యల నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ సస్పెన్స్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రోజురోజుకూ క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. అయితే కేవలం సాధారణ హత్యల ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా.. దానితో పాటు మూఢనమ్మకాలు, చేతబడులు, తంత్ర-మంత్రాలు, పౌరాణిక నేపథ్యాన్ని మిక్స్ చేసి తెరకెక్కించిన సిరీస్‌లు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంటాయి.