హైదరాబాద్ నగరంలో మరో విద్యాకుసుమం రాలిపోయింది. పోటీ పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక, ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాననే తీవ్ర మానసిక మనస్తాపంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పాతబస్తీ ప్రాంతంలో చోటుచేసుకుంది. యాకుత్పురాలోని సూర్యార్జంగ్ దేవ్డీ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రియాన్ (20) అనే విద్యార్థి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నీట్ పరీక్షలో ఆశించిన ర్యాంకు సాధించలేకపోయాననే మనస్తాపంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్లో విషాదాన్ని నింపింది. యాకుత్పురాలోని సూర్యార్జంగ్ దేవ్డీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రియాన్ నీట్ పరీక్ష కోసం చాలాకాలంగా కోచింగ్ తీసుకుంటున్నాడు.