రాజమౌళికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఓ చిత్రం ఎంతో ఇష్టమని వెల్లడించారు. ఈ సినిమాలోని సాంకేతిక అంశాలు, చలపతి రావు ప్రవేశ సన్నివేశం, విలన్లతో హాస్యం పండించడం, కృష్ణం రాజు నటన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని రాజమౌళి పంచుకున్నారు. ఆ సినిమాలోని షార్ట్ మేకింగ్ తనను విశేషంగా ఆకట్టుకుందని రాజమౌళి పేర్కొన్నారు. ముఖ్యంగా చలపతి రావు ఊర్లోకి ప్రవేశించే సన్నివేశం, క్రేన్ షాట్ ద్వారా కథానాయకుడి స్థానాన్ని, ఊరి నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని తెలిపారు.