ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలన్న నినాదంతో ఇరాన్ మహిళలు తమ పెళ్లి ఉంగరాలను సైతం విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ‘రింగ్స్ ఆఫ్ రివెంజ్’ (ప్రతీకార ఉంగరాలు) ప్రచారం చేపట్టారు. పెళ్లి ఉంగరాలను తీసి ఇచ్చేస్తున్న ఇరాన్ మహిళలు! ఇరాన్‌కు చెందిన తెహ్రాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం.. ‘మదరానేహ్’ (మాతృత్వం) అనే మహిళా బృందం ప్రచారాన్ని ప్రారంభించింది.