మెగాస్టార్ చిరంజీవి, అమల కాంబినేషన్లో వచ్చిన ‘రాజా విక్రమార్క’ చిత్రంలోని ఓ పాట విడుదలై దాదాపు 36 ఏళ్లు దాటినా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సంగీత ప్రియులను అలరిస్తోంది. ఇప్పుడు ఆ సాంగ్ దూసుకుపోతుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మాస్ , క్లాస్ మెస్మరైజింగ్ డ్యాన్స్‌లతో టాలీవుడ్‌ను ఊపొంచిన చిత్రాల్లో ‘రాజా విక్రమార్క’ ఒకటి. 1990లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, ఇందులోని పాటలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించాయి.