School Holiday in AP: అర్నబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాలు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికల దృష్ట్యా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో రేపు కూడా అంటే గురువారం రోజు కూడా పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం.