జీవనోపాధి కోసం పట్టణానికి వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. ఓ మోటారు మెకానిక్ గుండెపోటుకు గురయ్యాడు. జనగామ టౌన్, న్యూస్‌టుడే: జీవనోపాధి కోసం పట్టణానికి వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. దీంతో అకస్మాత్తుగా రహదారికి ఒక పక్కన ఒరిగి చనిపోయిన దృశ్యం పట్టణ ప్రజలు, వాహనదారులను కంటతడి పెట్టించింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటుకాలపల్లికి చెందిన బోడ లింగం(49) గ్రామంలో బోరు మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. మోటారు మరమ్మతుల కోసం బుధవారం జనగామకు వచ్చారు. రిపేర్ చేసిన మోటార్‌ను ద్విచక్ర వాహనంపై పెట్టుకుని తిరిగి బయలుదేరారు.