Abhijeet Dipke: ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టుల్ని కేంద్ర ప్రభుత్వం తొలగించేందుకు చర్యలు తీసుకుంటోందని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఇన్స్టాగ్రామ్ తమ పోస్టుల్ని తొలగిస్తోందని అన్నారు. ప్రతీ రోజూ వేలాది పోస్టులను తొలగించేలా ఇన్‌స్టాపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని పేర్కొన్నారు. బుధవారం ఎక్స్‌లో స్పందిస్తూ.. ఈ చర్యల వల్ల ప్రజల ప్రశ్నలు కనుమరుగు కావని అన్నారు. “ఇన్‌స్టాగ్రామ్‌పై ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం ప్రతిరోజూ వేలాది పోస్టులు, ఖాతాలను తొలగిస్తోంది..