రాజధాని నగరం హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగు నీటి సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. క్యూర్ ఏరియాలో మంచినీటి సరఫరా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో నేపథ్యంలో.