నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, పరిశోధనలో పోలీసులకు అత్యంత వేగవంతమైన ఆధారాలు అందించేలా తెలంగాణ పోలీసు శాఖ సాంకేతిక సరిహద్దులను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. కేవలం 15 సెకన్లలో అనుమానితుల ముఖాలను గుర్తించడం, సంఘటన స్థలంలో లభించే వేలిముద్రలను సాధారణ మొబైల్ ఫోన్లతోనే క్షణాల్లో సేకరించి నిందితులను పట్టించడం వంటి విప్లవాత్మక ఫీచర్లను నేర పరిశోధన విభాగం (సీఐడీ) క్షేత్రస్థాయిలోకి తెచ్చింది. డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ సి.వి. ఆనంద్ ఈ కీలక సాంకేతిక సాధనాలతో.