WPL Auction 2027: మహిళల ప్రీమియర్ లీగ్ 2027 నేడు కొచ్చిలో జరగనుంది. 146 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటుండగా, 27 స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడనున్నాయి. సోఫీ మోలిన్యూ, చమరి అటపట్టు, వృందా దినేశ్లపై భారీ బిడ్డింగ్ జరిగే అవకాశం ఉంది. WPL Auction 2027: మహిళల ప్రీమియర్ లీగ్(WPL) 2027 మినీ వేలం నేడు (అక్టోబర్ 28) జరగనుంది. కేరళలోని కొచ్చిలో జరిగే ఈ వేలంలో 146 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 119 మంది భారత ఆటగాళ్లు, 27 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.