Cyclone Arnab Rains Live Updates: అర్నబ్ తుఫాన్ తీరం దాటింది.. దాదాపు 5 గంటలపాటు తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగింది. అర్నబ్ బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. యానాంకు నైరుతిదిశగా తుఫాన్ తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 125–135 కి.మీల వేగంతో భీకర గాలులు వీస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అర్నబ్ తుఫాన్ ప్రభావంపై CM చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ధాటికి నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ తీవ్రత తగ్గిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు.