Banana, Sugarcane Crops Damaged: అర్నబ్ తుఫాన్ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల ధాటికి వేలాది ఎకరాల్లో అరటి, చెరకు పంటలు నేలకొరిగాయి. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ విరుచుకుపడటంతో.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. నేలమట్టమైన అరటి తోటలు: అర్నబ్.