మెడిసిన్ ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. MRPకి, రిటైలర్లు కొనుగోలు చేసే ధరలకు భారీ వ్యత్యాసం ఉండటంపై తీవ్రంగా ఫైర్ అయింది. మందుల కంపెనీల కోసమే వ్యవస్థ మొత్తం పనిచేస్తోందా అంటూ సుప్రీంకోర్టు నిలదీసింది. మందుల ధరల నియంత్రణ, ట్రేడ్ మార్జిన్ల పరిమితులపై దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. క్యాన్సర్ మందుల ధరలపై ప్రైవేట్ ఆసుపత్రులు, ఫార్మసీలు విధిస్తున్న భారీ లాభాల మార్జిన్లను.. మందుల ధరలు, ట్రేడ్ మార్జిన్లపై దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం...కేంద్రప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది.