మేడ్చల్-మల్కాజిగిరి: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళను మోసం చేసి, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం ఆశ చూపి డబ్బులు వసూలు చేయడంతో పాటు, మహిళను బెదిరించి ఈ దారుణానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగన్మోహన్ అనే వ్యక్తి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలిని నమ్మించాడు. ఈ క్రమంలో ఉన్నతాధికారికి డబ్బులు ఇవ్వాలని చెప్పి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితురాలి నుంచి అడపా దడపా ఇప్పటి వరకు రూ.4.50 లక్షలు వసూలు చేశాడు.