2017 లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళం భాషల్లో సినిమాలు చేసింది. అది కూడా స్టార్ హీరోలతో కలిసి. కానీ ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసి రావడం లేదు. అలాగనీ క్రేజ్ కూడా తగ్గడం లేదు. హీరోలతో పోల్చితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా రెండు, మూడు ఫ్లాపులు పడితే చాలు హీరోయిన్లకు అవకాశాలు కరవువుతాయి. ఫలితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్ అయిపోతారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇందుకు మినహాయింపు అని చెప్పవచ్చు. హైదారాబాద్ లో పుట్టి బెంగళూరులో పెరిగింది నిధి అగర్వాల్.