Hyderabad: హైదరాబాద్ నగరంలోని మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్, హోంగార్డ్ ఏసీబీ వలలో చిక్కారు. అయితే సీఐ కొండల్ రావు రూ.6 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ హోంగార్డ్ ఏసీబీకి చిక్కారు. సీఐ కొండల్ రావు ఆదేశాలతోనే.. సీఐ కొండల్ రావు ఆదేశాలతోనే లంచం తీసుకున్నట్లు సదరు హోంగార్డ్ అబిద్ అలీ ఏసీబీ అధికారులకు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓ కేసు మూసివేతకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో సీఐ కొండల్రావు, హోంగార్డ్ అబిద్ అలీని అరెస్ట్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు.