అక్కడ హస్తం పార్టీలో మంటలు అంటుకుంటున్నాయా? ఎమ్మెల్యే వైఖరి ఏకంగా చీలికలకు కారణం అవుతోందా? గత ఎన్నికల్లో తాము దగ్గరుండి గెలిపించిన నాయకుడి మీదే… ఇప్పుడు ద్వితీయ శ్రేణి తీవ్రంగా రగిలిపోతోందా? ఎవరా శాసనసభ్యుడు? సొంతోళ్ళే రివర్స్ అయ్యేందుకు దారితీసిన పరిస్థితులేంటి? మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్తో పాటు ఆయన భార్య, డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి తీవ్రంగా రగిలిపోతోందట. నియోజకవర్గ ముఖ్య నాయకులను ఎవర్నీ పట్టించుకోకుండా భార్యాభర్తలిద్దరూ సర్వం.