మనిషి భవిష్యత్తును కేవలం కష్టం, ప్రతిభ మాత్రమే నిర్ణయిస్తాయా? లేక పుట్టిన కుటుంబం, తల్లిదండ్రుల ఆదాయం, విద్యా సదుపాయాలు, నివసించే ప్రాంతం కూడా కీలక పాత్ర పోషిస్తాయా? భారతదేశంలో సామాజిక, ఆర్థిక చలనశీలతపై అధ్యయనాలు పేద కుటుంబాల పిల్లలు ఎదుర్కొనే అడ్డంకులను వెల్లడిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అవకాశాల వ్యత్యాసం, తండ్రి వృత్తి పిల్లల కెరీర్‌పై చూపే ప్రభావం సమాన అవకాశాలపై చర్చకు దారితీస్తున్నాయి. రూపాయి ఆదాయం లేని బీహార్‌లోని ఒక గ్రామీణ బాలుడు, బెంగళూరులోని ఓ మధ్యతరగతి లేదా ఉన్నత వర్గ బాలుడు.. ఇద్దరికీ చిన్నతనం నుంచీ పెద్దలు చెప్పే మాట ఒకటే..