కోసూరి వేణు గోపాల్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. గంభీరమైన గొంతు, భారీ కాయంతో కనిపించే ఈయన తన దైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు. చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు ఆయన. కామెడీ, విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ఆయన.. ఆ నటుడి పేరు కోసూరి వేణు గోపాల్..హీరోల తండ్రి పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు ఈయన. చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేసిన ఆయన ఎక్కువగా రాజమౌళి సినిమాల్లో కనిపిస్తారు.