శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్నారు. వీరికి 10 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారి దర్శనానికి 10 గంటలు | general. తిరుమల, న్యూస్టుడే: శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్నారు. శ్రీవారిని గురువారం 65,113 మంది దర్శించుకోగా హుండీ కానుకలు రూ.3.82 కోట్లు లభించాయి. అన్నప్రసాదాలను 1.71 లక్షల మంది స్వీకరించగా, లడ్డూ ప్రసాదాలు 3.71 లక్షలు విక్రయించారు. వరుస వర్షాలతో శ్రీవారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు ఇబ్బందిపడుతున్నారు.