రాష్ట్రంలో రూ.11,731.68 కోట్ల పెట్టుబడులతో 20,879 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా 67 సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకుంది. వీటిలో తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో రూ.7,380.68కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 50 కంపెనీలు ఆసక్తి చూపాయి. తిరుపతి ప్రాంతీయ సదస్సులో 67 సంస్థలతో ఒప్పందాలు | general. తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు సంబంధించి వీబీఆర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను చూపుతున్న ఆ సంస్థ చీఫ్ సప్లై చైన్ అధికారి మధుకర్ కన్సల్, ఏపీ ఈడీబీ సీఈవో షాన్మోహన్, ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, యువరాజ్ తదితరులు.