విద్యార్థుల్లో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వనదర్శిని’ కార్యక్రమం నిధుల ఖర్చుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూశాయంపేట, న్యూస్టుడే: విద్యార్థుల్లో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వనదర్శిని’ కార్యక్రమం నిధుల ఖర్చుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ అటవీ శాఖ సర్కిల్ పరిధిలోని కాకతీయ జూపార్కు, ఎల్కతుర్తి, దేవునూర్ అటవీ ప్రాంతాల్లో విద్యార్థుల వనదర్శిని కార్యక్రమం నిర్వహణకు కేటాయించిన నిధుల వినియోగంపై ఆరోపణలున్నాయి. ప్రభుత్వం 2023 నుంచి 2026 వరకు రూ.5 లక్షలు విడుదల చేసింది. క్షేత్ర స్థాయిలో మాత్రం నామమాత్రపు ఖర్చులతోనే కార్యక్రమాలను ముగించి నిధులు కాజేశారనే విమర్శలున్నాయి.