మొక్కజొన్న సాగుచేసిన రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రికార్డు స్థాయి ధర పలుకుతుండటమే కారణం. ప్రభుత్వ మద్దతు ధరకు మించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. . న్యూస్టుడే, రామాయంపేట (చేగుంట) : మొక్కజొన్న సాగుచేసిన రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. జిల్లాలో వరి, పత్తి తర్వాత మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది 4542 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. జిల్లాలో చేగుంట, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, శివ్వంపేట, వెల్దుర్తి తదితర మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేశారు. క్వింటాలుకు రూ.2800 చెల్లించి వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.