వివాహేతర సంబంధానికి అడ్డుపడుతోందని భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పర్వతగిరి, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధానికి అడ్డుపడుతోందని భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పర్వతగిరి సీఐ సంతోష్, ఎస్సై పెగడ రాజ్‌కుమార్ వెల్లడించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని మాల్యతండా గ్రామ శివారు హర్జతండాకు చెందిన పాల్తియ బాలు, పూలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. బాలుకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 24న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.