ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ప్రధాన జలాశయాలు కూడా ముందుగానే ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్, న్యూస్‌టుడే: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సుమారు లక్షకు పైగా జనాభా కలిగిన మహబూబాబాద్‌లో ఈ ఏడాది వేసవిలో తాగునీటి నీటి ఎద్దడి ముప్పు ప్రమాదం పొంచి ఉంది. ఇన్నాళ్లు పాలేరు జలాశయం నుంచి సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటితో తాగునీటి అవసరాలు తీరుతుండగా ప్రతికూల పరిస్థితుల్లో పాలేరు నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలిగితే నీటి కొరత ఎదురుకానుంది.