వరంగల్ నగరంలో నయా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రజల అత్యాశ.. అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని భారీ మోసానికి తెర తీశారు. నకిలీ సంస్థను ఏర్పాటు చేశారు. మట్టెవాడ, న్యూస్టుడే: వరంగల్ నగరంలో నయా మోసం వెలుగులోకి వచ్చింది. అయ్యప్ప, తులసి, కరుంగళి మాలల పేరుతో జరిగిన మోసంలో నగర ప్రజలు భారీగా డబ్బులు కోల్పోయి లబోదిబోమంటున్నారు. ఆధ్యాత్మిక కోణంలో జరిగిన మోసంలో వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ దేశాయిపేట రోడ్డులోని ఓ భవనంలో జులై నెలలో మల్లికార్జున్ అనే వ్యక్తి అయిదుగురు సిబ్బందితో కార్యాలయం ఏర్పాటు చేశాడు. దీనికితోడు ఆగస్టులో పత్రికల్లో ప్రకటనలు సైతం ఇచ్చాడు.