కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట వాహనాలకు కాపలా కరవైంది. ఎనిమిది నెలలుగా పార్కింగ్ నిర్వహణకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ప్రయాణికులు తమ వాహనాల భద్రతకు ఆందోళన చెందుతున్నారు. న్యూస్‌టుడే, కాజీపేట: కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట వాహనాలకు కాపలా కరవైంది. చాలా ద్విచక్ర వాహనాలు ఇప్పటికే చోరీకి గురయ్యాయి. పెట్రోల్, ప్లగ్గులు, చక్రాల దొంగతనాలు కూడా అయ్యాయి. అయినా రైల్వే మాత్రం గుత్తేదారు నుంచి టెండర్ వార్షిక చెల్లింపులో తగ్గింపును అంగీకరించడం లేదు. దీంతో చాలా మంది గుత్తేదారులు పార్కింగ్‌ను దక్కించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. గతేడాది సంవత్సరానికి రూ.51 లక్షల చొప్పున టెండర్ ప్రక్రియ ద్వారా తీసుకుని నిర్వహించారు.