ఎల్నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్ నారాయణ సూచించారు. వడ్డేపల్లి, న్యూస్టుడే: ఎల్నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్ నారాయణ సూచించారు. హనుమకొండలోని లోక్సత్తా కార్యాలయంలో సోమవారం లోక్సత్తా, జ్వాల సంస్థల వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిలపక్ష నాయకులు, మేధావుల సలహాలతో తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజాధనాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని, యువతను మద్యం, మాదకద్రవ్యాల బారినపడకుండా కాపాడాలన్నారు.