‘వందలేళ్ల వారసత్వం బొగ్గు కోసం బుగ్గి!’ పేరుతో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ రాసిన వ్యాసం (10.10.2026) కేవలం బొగ్గు కోసం వందల ఏళ్ళ చరిత్ర గల రామప్ప దేవాలయాన్ని ప్రమాదంలోకి... ఆయనే కాదు, వరంగల్ ఉమ్మడి జిల్లా పౌర సమాజం మొత్తం ఆ ప్రాంతంలో బొగ్గు తవ్వకం నిలిపి వేయాలనీ, కాకతీయుల వారసత్వ సంపదను, రామప్ప దేవాలయాన్ని కాపాడాలనీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. రామప్ప దేవాలయ పరిరక్షణ కోసం వినోద్‌కుమార్ ప్రజల పక్షాన నిలబడటాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు స్వాగతిస్తారు.