కుప్పం అటవీ ప్రాంతంలో భర్త శశికుమార్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. భార్య లక్ష్మి తన ప్రియుడు ప్రభుదేవతో కలిసి ‘ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం’ అంటూ నమ్మించి శశికుమార్‌ను అడవికి తీసుకెళ్లి బీరు బాటిళ్లు, బండరాయితో కొట్టి చంపింది. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టినా, పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దుల్లోని కుప్పం అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఒక దారుణ హత్యోదంతం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ సంచలనం సృష్టించింది.