దాచేపల్లి మండలం పెదగార్లపాడులో చెట్టుకు వేలాడుతూ కనిపించిన షేక్ సైదా మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మొదట ఆత్మహత్యగా భావించినా, కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిందితులు మణికంఠ, స్నేహితులు లొంగిపోవడంతో అసలు నిజం బయటపడింది. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. షేక్ సైదా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో నివసిస్తుంటాడు. అక్టోబర్ 19వ తేదీన గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.