ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడమైన తాజ్మహల్ శరద్ పూర్ణిమ వేళ చల్లని వెన్నెల కాంతుల్లో ధగధగ మెరిసిపోయింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ పౌర్ణమి చుట్టూ ఉన్న ఐదు రోజుల పాటు రాత్రి వేళల్లో తాజ్మహల్ వీక్షణకు అవకాశం కల్పిస్తుంది. రాత్రి సమయంలో ప్రత్యేక భద్రత నడుమ నిర్ణీత సంఖ్యలో పర్యాటకులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. వెన్నెల్లో పాలరాతి శిల్పకళా చాతుర్యం ఉట్టిపడే ఈ అరుదైన దృశ్యాన్ని కనులారా వీక్షించిన సందర్శకులు మంత్రముగ్ధులై పరవశించిపోయారు.