భోగాపురం విమానాశ్రయం నుంచి దిల్లీకి ఆకాశ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. దిల్లీ నుంచి భోగాపురం వచ్చిన విమానం తిరుగుప్రయాణంలో 174 మందితో 9.05 గంటలకు బయలుదేరి 11.30కి దిల్లీ చేరుకుంది. భోగాపురం-దిల్లీ, తిరుపతి-బెంగళూరు విమాన సర్వీసులు ప్రారంభం | general. ఈనాడు-విజయనగరం, రేణిగుంట, న్యూస్టుడే: భోగాపురం విమానాశ్రయం నుంచి దిల్లీకి ఆకాశ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసులు రోజూ నడవనుండగా దిల్లీలో ఉదయం 5.55కు బయలుదేరి 8.20కి భోగాపురం చేరుకుంటుంది. తిరుపతి-బెంగళూరు మధ్య నూతన విమాన సర్వీసును ఫ్లై91 విమానయాన సంస్థ ఆదివారం ప్రారంభించింది. ఉదయం 7.50కి తిరుపతిలో బయల్దేరి 8.45కు బెంగళూరు చేరుకుంటుంది.