కొమురం భీమ్ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో రేపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అయితే, రెసిడెన్షియల్ పాఠశాలలకు సెలవు వర్తించదు. సెలవు ఇచ్చిన విద్యాసంస్థలకు నవంబర్ 14న రెండో శనివారం పని దినంగా ఉంటుందని కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.. హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణలోని రెండు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటించారు. ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.