మార్కెట్‌కి వెళ్లి ఎర్రగా, నిగనిగలాడుతూ మెరిసిపోతున్నాయని యాపిల్స్ కొంటున్నారా? ఇంటికి తెచ్చి కట్ చేసి చూస్తే చప్పగా, పిప్పిపిప్పిగా ఉంటుందా? కేవలం రంగును చూసి మోసపోతే మీ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే. పండు చూడటానికి ఎంత బాగుందన్నది కాదు.. లోపల ఎంత తియ్యగా, ఎంత రసభరితంగా ఉందనేదే ముఖ్యం. సహజమైన తియ్యటి యాపిల్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే ఉండదు అన్నది నానుడి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే పండ్లలో యాపిల్ అగ్రస్థానంలో ఉంటుంది.