Shreyas Iyers Post Match Comments: న్యూజిలాండ్తో జరిగిన ఉత్కంఠభరిత రెండో టి20 మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తిలక్ వర్మ (51*), నితీష్ కుమార్ రెడ్డి (26) అద్భుత పోరాటంతో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ గెలుపు అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, 300వ టి20 మ్యాచ్లో గెలవడం సంతోషమని ఆయన అన్నారు.