హైదరాబాద్ పాతబస్తీలో 21 ఏళ్ల యువకుడి హత్య కలకలం రేపింది. తల్లి మనీషాతో భగత్ సింగ్కు ఉన్న సంబంధాన్ని మధుర్ సింగ్ వ్యతిరేకించడమే ఈ దారుణానికి కారణమా? లేక ఆస్తి వివాదం కూడా హత్యకు దారితీసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి బంధువులు చేస్తున్న ఆరోపణలతో ఈ కేసులో కొత్త కోణాలు తెరపైకి వచ్చాయి. హుస్సేనీ ఆలం పరిధిలో దారుణం హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 24న ఈ ఘటన చోటుచేసుకుంది. మధుర్ సింగ్ తల్లి మనీషాతో భగత్ సింగ్కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మధుర్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.