ఆంధ్రప్రదేశ్‌కు తుఫాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ప్రస్తుతం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా, ఆ తర్వాత తీవ్ర తుఫానుగా, బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేసింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు.