తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, నటుడిగా, ప్రతినాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దివంగత నటుడు శ్రీహరి. అయితే ఆయన హీరోగా.. మీనా కథానాయికగా నటించిన ఓ సినిమా విడుదల కావడానికి దాదాపు 8 ఏళ్లు పట్టింది. ఇందుకు గల కారణాలను తాజాగా డైరెక్టర్ దేవి ప్రసాద్ వెల్లించారు. అసలేం జరిగిందంటే. తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం కలిగిన దర్శకుడు దేవి ప్రసాద్, తన కెరీర్లో ఎన్నో మధుర జ్ఞాపకాలు, కొన్ని చేదు అనుభవాలను కూడగట్టుకున్నారు.