ప్రతీ రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫామ్ ఎత్తు.. రైలు తలుపు ఎత్తుకు సరిసమానంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే అన్ని రైల్వే స్టేషన్లలోనే ఎత్తు ఒకేలా ఉంటుందా.. ? ఎత్తును ఎలా నిర్ణయిస్తారు? అనే డౌన్ చాలమందిలో కలుగుతుంది. దీనికి సమాధానాలు ఇందులో చూద్దాం. రైళ్లల్లో ప్రతీఒక్కరూ ఒక్కసారైనా ప్రయాణం చేసి ఉంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ఎక్కువమంది రైలు జర్నీనే ఎంచుకుంటారు. ఎందుకంటే రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, తక్కువగా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అయితే రైల్వే ప్రయాణం చేసేవారందరూ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాంకు, ట్రైన్ తలుపుకు మధ్య ఎత్తు ఒకేలా ఉంటుందనే విషయం గమనించే ఉంటారు.